News September 16, 2025
విజయవాడ ఉత్సవ్‌కు దుర్గమ్మ సెంటిమెంట్ ఎఫెక్ట్..!

దసరా సందర్భంగా విజయవాడలో నిర్వహించనున్న ఉత్సవ్‌కు దుర్గమ్మ సెంటిమెంట్ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చే పవిత్ర సమయంలో, సినిమా తారల నృత్యాలు, పాటల కార్యక్రమాలు నిర్వహించడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది దుర్గమ్మ ప్రాధాన్యతను తగ్గించడమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని పలువురు ఆరోపిస్తున్నారు.
Similar News
News September 16, 2025
రక్షణ శాఖ మంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం పికెట్ గార్డెన్‌లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
News September 16, 2025
ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు.
News September 16, 2025
ASF: ‘కొమరం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి’

ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం 85వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం కెరెమెరి మండలం జోడేఘాట్‌లో కుమ్రం భీం 85వ వర్ధంతిని పురస్కరించుకొని ఐటీడీఏ పీవో ఖుష్బూ, జిల్లా ఎస్పీ కాంతిలాల్ సుభాశ్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి హెలిప్యాడ్, వర్ధంతి, దర్బార్ ఏర్పాట్లపై పరిశీలించారు.