News October 25, 2025

విజయవాడ: ఉదయం ఒక ధర.. మధ్యాహ్నం ఇంకో ధర!

image

నగరంలోని పూల మార్కెట్‌లో ఇష్టారీతిన, నచ్చిన ధరలకు పూలను విక్రయిస్తున్నారు. గులాబీ పూలు తెల్లవారుజామున KG ధర రూ.160కే అమ్ముతుండగా మధ్యాహ్నం రూ.300 వరకు అమ్ముతున్నారు. కొనుగోలుదారులు ఎక్కువైతే అమాంతం ధరలు పెంచేస్తున్నారు. కర్ణాటక నుంచి దిగుబడి అవుతుండటంతో ధరలు కాస్త ఎక్కువే ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. వీఎంసీ స్థలంలో వ్యాపారం ఇలా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

Similar News

News October 25, 2025

ద్రాక్షారామ ఆలయ ఆవరణలో వ్యక్తి మృతి

image

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం దొంగ భీమన్న అనే కార్మికుడు గడ్డి మిషన్‌తో గడ్డి కోస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆలయ సిబ్బంది వెంటనే ద్రాక్షారామ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఎం. లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

News October 25, 2025

అడవినెక్కలంలో లారీ, బైక్ ఢీ.. మహిళ మృతి

image

ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో శనివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నున్న గ్రామానికి చెందిన దేవశెట్టి ప్రమీల దేవి (60) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. నెక్కలం అడ్డరోడ్డులోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భార్యాభర్తలు ఇంటికి బై‌క్‌పై వెళ్తున్నారు. వెనుక నుండి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొంది. ఈ ఘటనలో ప్రమీల దేవి మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 25, 2025

మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన వ్యక్తి అరెస్ట్

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో SAతో మ్యాచ్ కోసం ఇండోర్(MP)కు వెళ్లిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న హోటల్ నుంచి కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు ప్లేయర్లను బైక్‌పై వచ్చిన ఆకతాయి అసభ్యంగా తాకి పారిపోయాడు. వారు జట్టు మేనేజ్‌మెంట్‌కు విషయం చెప్పగా సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు అకీల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.