News October 28, 2025
విజయవాడ: ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ యువతీ యువకులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత సాధించిన 21-30 ఏళ్ల మధ్య వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 2వ తేదీ వరకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం ఆధ్వర్యంలో జర్మన్ భాషలో శిక్షణ అందిస్తారు.
Similar News
News October 28, 2025
తూ.గో: సార్.. ఈ సమస్యలను పరిష్కరించండి

తుఫాన్ నేపథ్యంలో ఉమ్మడి తూ.గో జిల్లా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. చాలా ఏరియాల్లో మంగళవారం ఉదయం నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ‘మీ ఏరియాలో కరెంట్ ఉందా? లేదా?’ అంటూ Way2Newsలో ప్రచురితమైన వార్త కింద <<18131522>>కామెంట్ల <<>>రూపంలో ప్రజలు తమ సమస్యలను వివరించారు. వీటిపై ఆయా ప్రాంతాల అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
News October 28, 2025
మొంథా తుపాన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎర్ర హెచ్చరిక!

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ తీవ్ర వాయుగుండంగా బలపడింది. తుపానుగా మారి గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లికి రెడ్ అలెర్ట్ జారీ కాగా.. వరంగల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అతి భారీ వర్షాలతో మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
News October 28, 2025
SRPT: ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

వర్షాలు కురుస్తున్న నేపద్యంలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జాజిరెడ్డిగూడెం మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రైతులకు సరిపడా టార్పాలిన్లను అందించాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.


