News June 4, 2024

విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని విజయం

image

విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ ఘనవిజయం సాధించారు. నిర్ణీత రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి శివనాథ్ 2,82,085 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి కేశినేని నానిపై విజయం సాధించారు. టీడీపీ ఘనవిజయంతో ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ, జనసేన కూటమి శ్రేణులు ఫుల్ జోష్‌లో సంబరాలు చేసుకుంటున్నాయి.

Similar News

News March 1, 2026

రేపు కలెక్టరేట్‌లో ‘మీ కోసం’: కలెక్టర్

image

ఈనెల 2న సోమవారం కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ఉదయం 10:30 గంటల నుంచి ‘మీ-కోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా వచ్చి వినతులు సమర్పించాలన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 1, 2026

అడ్డంకులు అధిగమించి పరిశ్రమలు నెలకొల్పాలి: కలెక్టర్

image

జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.

News February 28, 2026

కృష్ణాజిల్లాలో 91.26% మేర పెన్షన్ల పంపిణీ

image

కృష్ణాజిల్లాలో తొలి రోజు 91.26% మేర పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరి హరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2,32,715 పెన్షన్లకు గాను, 2,12,375 పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 92,38,80,000 మేర పెన్షన్ సొమ్మును అందజేశామన్నారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో అందజేస్తామన్నారు.