News October 9, 2025

విజయవాడ: ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా ప్రవీణ్ చంద్

image

ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ బదిలీ అయ్యారు. తాజా బదిలీలలో ఏపీ ట్రాన్స్‌కోకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రవీణ్ చంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులిచ్చారు. కాగా 2019 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్ చంద్ గతంలో విజయవాడ సబ్ కలెక్టరుగా పనిచేశారు.

Similar News

News October 10, 2025

నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునః ప్రారంభం

image

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఈఓ మూర్తి తెలిపారు. ఈనెల 2 నుంచి 9 వరకు ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. వీటిని పురస్కరించుకుని ఈ 8 రోజులు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో వీటిని పునఃప్రారంభిస్తున్నట్టు తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.

News October 10, 2025

కడప: ‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నయని, సిబ్బంది సన్నద్దం కావాలని ఎస్పీ విశ్వనాథ్ అన్నారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో క్రైమ్‌పై సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బంది కృషి చేయాలని, పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల భద్రత, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

News October 10, 2025

ప్రకాశం: ‘సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం’

image

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు – మందుల పంపిణీ అంశాలపై జేసీ గోపాలకృష్ణ వీడియో కాన్ఫరెన్స్లో వివరణ ఇచ్చారు.