News December 22, 2024

విజయవాడ: కనకదుర్గమ్మని దర్శించుకున్న మంత్రి అనిత

image

విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మవారిని మంత్రి వంగలపూడి అనిత ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో కేఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను మంత్రికి అందజేశారు.  అనంతరం మంత్రి దీక్షల విరమణకు విచ్చేసిన భవానీలతో మాట్లాడారు. అమ్మవారి ఆలయంలో చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

Similar News

News September 13, 2025

ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

image

జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ డీ.కే. బాలాజీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పశుసంపదను రక్షించేందుకు ప్రతి రైతు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

News September 12, 2025

కృష్ణా: వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.

News September 11, 2025

కృష్ణా: సబ్ జూనియర్ సెపక్ తక్రా క్రీడాకారుల ఎంపిక

image

కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సబ్ జూనియర్ బాల, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీలలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నరేష్ పాల్గొన్నారు.