News July 11, 2024

విజయవాడ కనకదుర్గమ్మ హుండీలో 1300 US డాలర్లు

image

దుర్గామల్లేశ్వర స్వామి హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 20 రోజులకుగానూ రూ.3,36,59,796 నగదు, 436 గ్రా. బంగారం, 6.06 కిలోల వెండి వచ్చిందని అధికారులు చెప్పారు. 1300 US డాలర్లు, 85 UK పౌండ్లు, 7 ఆస్ట్రేలియా డాలర్లు, 12 సింగపూర్ డాలర్లు, 80 కెనడా డాలర్లు, 70 న్యూజిలాండ్ డాలర్లు, 625 కువైట్ దీనార్లు, 118 మలేషియా రింగెట్స్, ఈ-హుండీ ద్వారా రూ.1,91,787 ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News September 17, 2025

తాడేపల్లి: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

image

ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు సీఎంను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News September 17, 2025

తురకపాలెంలో జిల్లా కలెక్టర్ పర్యటన

image

గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం తురకపాలెంలో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. జూన్, జులై నెలల్లో ఎదురయ్యే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు.

News September 17, 2025

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ రత్న షీలామణి

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్, ఆంగ్ల విభాగ ఆచార్యులు ప్రొఫెసర్ కె.రత్న షీలామణి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ నియామకంపై వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు రత్న షీలామణికి అభినందనలు తెలిపారు.