News December 22, 2024
విజయవాడ: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించిన అధికారులు
మోటుమర్రి జంక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా CST ముంబై, భువనేశ్వర్ మధ్య ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.11019 & 11020 కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు 2025 జనవరి 6 నుంచి 8 వరకు గుంటూరు – పగిడిపల్లి మీదుగా ప్రయాణిస్తాయన్నారు. ఆయా తేదీలలో ఈ రైళ్లు మధిర, ఖమ్మం టౌన్, మహబూబాబాద్, వరంగల్, ఖాజీపేటలో ఆగవని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 22, 2024
రేపు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్
కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ సోమవారం పర్యటించనున్నట్లు పెనమలూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ముప్పా రాజా తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో రూ.3కోట్లతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను పవన్ పరిశీలించనున్నట్లు చెప్పారు.
News December 22, 2024
అనూష వైద్య చికిత్స బాధ్యత నాది: మంత్రి లోకేశ్
నూజివీడు ట్రిపుల్ ఐటీ (E1)విద్యార్ధి మురపాల అనూష(17) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందని సాయం కావాలంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మంత్రి లోకేశ్ స్పందించారు. పేద కుటుంబానికి చెందిన అనూష కుటుంబం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు చికిత్స చేయించే స్థోమత లేదని తెలుపగా.. తన కార్యాలయ సిబ్బంది ఆమె చికిత్స బాధ్యత తీసుకుంటారని లోకేశ్ తాజాగా హామీ ఇచ్చారు.
News December 22, 2024
గుండెపోటుతో హాస్పిటల్‌కి వెళుతుండగా ప్రమాదం
తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామంలో సామేలు అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో అతనిని హాస్పిటల్‌కు తీసుకు వెళుతున్న క్రమంలో ఆటో అదుపుతప్పి ఓ ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో సామేలు అక్కడికక్కడే మృతిచెందగా అతనికి సాయంగా వస్తున్న అతని భార్య పున్నమ్మ, ఆటో డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ చెప్పారు.