News October 19, 2024

విజయవాడ: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వైసీపీ నేతలు

image

వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ వైసీపీ నేతలు శనివారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు విజయవాడ రాజ్‌భవన్‌లో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, షేక్ ఆసిఫ్, రాయన భాగ్యలక్ష్మి తదితరులు గవర్నర్‌ను కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం జరిగి, నష్టపరిహారం అందే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు.

Similar News

News July 7, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పామర్రులో దొంగల ముఠాను అరెస్ట్
☞కృష్ణా: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ
☞ మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు
☞ ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
☞నూజివీడు: IIITలో 141 సీట్లు ఖాళీ
☞ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన

News July 7, 2025

మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

image

మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఈనెల 10న నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు.

News July 7, 2025

మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీవో స్వాతి, తదితరులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.