News October 15, 2025

విజయవాడ: గేదెలపై పడ్డ దొంగల కళ్లు!

image

ఎన్టీఆర్ జిల్లాలో ఓ దొంగల ముఠా కళ్లు గేదెలపై పడ్డాయి. పాలు, వాటి అనుబంధ పదార్థాల ధరలు పెరగడంతో గేదెల విలువ బాగా పెరిగింది. రూ.లక్ష వరకు ధర ఉంటోంది. ఈ నేపథ్యంలో ఓ ముఠా గేదెలు ఎత్తుకుపోతోంది. బొలేరో, టాటా ఏస్‌ వంటి వాహనాల్లో వచ్చి గేదెలను అందులోకి ఎక్కించి దొంగిలించుకుపోతున్నారు. ఈ క్రమంలో విజయవాడ CCS పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఠా మొత్తాన్ని పట్టుకునే పనిలో పడ్డారు.

Similar News

News October 15, 2025

TU: ప్రశాంతంగా ముగిసిన ఎంఎడ్ పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న ఎంఎడ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. బుధవారం జరిగిన పరీక్షలో 100 శాతం విద్యార్థులు హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

News October 15, 2025

‘తెలంగాణ రైజింగ్ విజన్’లో పాల్గొనాలి: కలెక్టర్‌

image

కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047’ సర్వేలో జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ఐటీ వంటి రంగాలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.

News October 15, 2025

NZB: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి: బస్వా లక్ష్మీనర్సయ్య

image

వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సివిల్ సప్లై కమీషనర్‌ను బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు