News December 29, 2025

విజయవాడ గ్రేటర్ హామీ నెరవేరకుండానే ఎన్నికలకు.. మరో’సారీ’..!

image

గ్రేటర్ విజయవాడ కల సాకారానికి మరింత సమయం పట్టేలా ఉంది. కేంద్రం జనగణన పూర్తి చేసిన తర్వాత గ్రేటర్ విజయవాడపై ఫోకస్ పెడతామని మంత్రి నారాయణ అన్నారు. మరోవైపు జనగణనతో సంబంధం లేకుండా జిల్లాలు, రెవిన్యూ డివిజన్స్ ప్రక్రియ ముందుకెళ్తుండగా.. గ్రేటర్ విజయవాడకి అన్ని అడ్డంకుల్లా కనిపిస్తోంది. ఇక వచ్చే ఏడాదిలో జరగనున్న విజయవాడ కార్పొరేషన్ ఎన్నిలల్లోను గ్రేటర్ లేకుండానే నేతలు ముందుకెళ్ళానున్నారు.

Similar News

News February 21, 2026

వెనక్కి తగ్గేది లేదు: ట్రంప్

image

తాను విధించిన టారిఫ్స్‌ను <<19195677>>రద్దు చేస్తూ<<>> సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఈ నిర్ణయం తీవ్ర నిరాశపరిచిందని, కొంత మంది న్యాయమూర్తులు విదేశీ ప్రయోజనాలకు ప్రభావితమయ్యారని ఆరోపించారు. కోర్టులోని కొంతమంది సభ్యులను చూసి సిగ్గుపడుతున్నానని ఫైరయ్యారు. వాణిజ్య ఎజెండా నుంచి వెనక్కి తగ్గేది లేదని, ఇంకా బలమైన పద్ధతులు తనకు తెలుసని హెచ్చరించారు.

News February 21, 2026

బాన్సువాడ ఘటన.. పరిస్థితి అదుపులో ఉంది: SP

image

బాన్సువాడ రిలయన్స్ మార్ట్ వివాదంపై ఎస్పీ రాజేశ్ చంద్ర స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. పట్టణంలో శాంతిని కాపాడాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే వ్యక్తులతో పాటు గ్రూప్ అడ్మిన్‌లపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలు ఆందోళన చెందవొద్దని కోరారు.

News February 21, 2026

VJA: బాలికపై వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలు!

image

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడికి విజయవాడ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. 2021లో వణుకూరుకు చెందిన బాలిక వద్దకు వెళ్లి, మంచినీళ్ల సాకుతో వించిపేటకు చెందిన కలపాల సామ్యూల్ అసభ్యంగా ప్రవర్తించాడు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించారు.