News January 3, 2025
విజయవాడ: చిరంజీవి బుక్‌తో పవన్ కళ్యాణ్
విజయవాడలో బుక్ ఫెయిర్ గురువారం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు స్టాల్స్‌లో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. మెగాస్టార్ చిరంజీవి సినీప్రస్థానం గురించి యూ.వినాయకరావు రచించిన “మెగాస్టార్ లెజెండ్ బుక్”ను ఆయన తీసుకున్నారు. సంబంధిత ఫొటోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Similar News
News January 5, 2025
VJA: డబ్బులు ఇప్పించాలని మహిళ ఆత్మహత్యాయత్నం
గుంటూరు జిల్లాకు చెందిన రామకృష్ణ అనే ఆర్మీ ఉద్యోగి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విజయవాడ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8 లక్షలు తీసుకొని మోసం చేశాడు. బాధితురాలు స్పందనలో ఫిర్యాదు చేయడంతో గుణదల పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చినా డబ్బులు తిరిగివ్వకుండా బాధితురాలిపై ఇష్టానుసారంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన మహిళ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తనడబ్బు ఇప్పించాలని వాపోయారు.
News January 5, 2025
పెనమలూరు: బాలికను బంధించి లైంగిక దాడి
బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనపై పెనమలూరు P.S.లో కేసు నమోదైంది. సనత్ నగర్‌లో బాలిక కుటుంబ సభ్యులతో ఉంటూ ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో కంకిపాడుకు చెందిన విజయబాబు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఈనెల 2న బాలికకు ఫోన్ చేసి బయటకు వెళ్దామని చెప్పి కంకిపాడుకు తీసుకెళ్లాడు. బాలికను రూంలో బంధించి లైంగిక దాడి చేసి, 3వ తేదీన పంపాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 4, 2025
గుడివాడ: CRPF జవాన్ మృతి..కన్నీటి ఎదురుచూపులు
అరుణాచలప్రదేశ్‌లో సీఆర్పిఎఫ్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ గుడివాడకు చెందిన కర్ర రామకృష్ణ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. భౌతిక కాయం రావడానికి మరొక రోజు ఆలస్యం అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు రావలసిన భౌతికకాయం వాతావరణం అనుకూలించక ఫ్లైట్ రద్దు అవ్వడంతో ఆలస్యమైందన్నారు. 5వ తేదీ బంటుమిల్లిరోడ్డులోని ఆయన నివాసం వద్దకు తీసుకురానున్నట్లు తెలిపారు.