News December 3, 2024

విజయవాడ: చెత్తబుట్టలో పసికందు

image

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపను గుర్తుతెలియని వ్యక్తులు చెత్త బుట్టలో పడేశారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన పాపను ఈరోజు తెల్లవారుజామున పడేసి వెళ్లిపోయారన్నారు. ఏడుపులు విడిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు రంగ ప్రవేశం చేసి పాపను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 14, 2026

కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 132 అర్జీలు

image

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.

భూగర్భజలాల పెంపునకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

image

జిల్లాలో జలధార పథకం కింద భూగర్భ జలాల మట్టం పెంపుదలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జలధార కార్యాచరణ ప్రణాళికపై సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని చెరువుల పూడికలను ఉపాధి హామీ పథకం కింద తీసేందుకు మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేయాలన్నారు.