News September 21, 2025

విజయవాడ: జగజ్జననీకి సమర్పించే నైవేద్యం ఇదే

image

కనకదుర్గమ్మవారికి వేకువజాము సుప్రభాతం, పూజాదికాలు, సాంబ్రాణి అనంతరం బాలభోగం కింద దద్ధోజనం సమర్పిస్తారు. తర్వాత ఉదయం 10కి రవ్వకేసరి, పులిహోర, దద్ధోజనం, కట్టెపొంగలి, లడ్డు బూంది, చక్రపొంగలితో రాజభోగం, 12కి గారెలతో పంచభోగాలను నివేదిస్తారు. సాయంత్రం 4కి శనగలు, స్వీట్, హాట్..6 గంటలకు మహానివేదనలో కదంబవంటకం, కూరలు, స్వీట్, హాట్ తదితర పదార్థాలు అమ్మవారికి సమర్పిస్తామని అర్చకులు వెల్లడించారు.

Similar News

News September 21, 2025

రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: భట్టి

image

TG: రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని Dy.CM భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. మహిళలంతా ఆర్థికంగా, శక్తిమంతులుగా ఎదగాలి’ అని అన్నారు. అంతకుముందు కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ‌పై రూపొందించిన నృత్య నాటకాన్ని తిలకించారు.

News September 21, 2025

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు: ఎస్పీ

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలపైన కానీ, కులమతాల పైనగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు కదిరికి చెందిన అంజాద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఆయనపై ఐదు కేసులు నమోదు చేసి జైలుకు పంపామని తెలిపారు.

News September 21, 2025

గుత్తివారిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామ సచివాలయం సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నీలం రంగు బనియన్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడని, శరీరంపై గాయాలు లేవని, మద్యం అధికంగా సేవించడం వల్ల డీహైడ్రేషన్ లేదా అనారోగ్యం కారణమై ఉండవచ్చని రేణిగుంట అర్బన్ పోలీసులు అనుమానిస్తున్నారు. వయసు 25 నుంచి 30 ఏళ్ల ఉండొచ్చు అని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.