News February 6, 2026

విజయవాడ: జగన్ పర్యటనలో స్వల్ప మార్పు!

image

YS జగన్‌ ఇబ్రహీంపట్నం పర్యటన చివరి నిమిషంలో రూట్ మ్యాప్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల సూచనల మేరకు తాడేపల్లి నుంచి బయలుదేరే కాన్వాయ్.. మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్, గొల్లపూడి, నల్లగుంట, గుంటుపల్లి మీదుగా జోగి నివాసానికి చేరుకోనుంది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వెస్ట్ బైపాస్ గుండా వెళ్లాలని పోలీసులు సూచించిన నేపథ్యంలో వైసీపీ కార్యాలయం ఈ మార్పులను ఖరారు చేసింది.

Similar News

News February 13, 2026

కానిస్టేబుల్‌ సస్పెండ్.. గెలిచిన భార్య!

image

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో సస్పెండైన కానిస్టేబుల్‌ భార్య గెలిచారు. సిద్దిపేట(D) చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో BRS తరఫున గీతాంజలి పోటీ చేశారు. ఆమె భర్త రమేశ్ కొమురవెళ్లి PSలో కానిస్టేబుల్‌. ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు వెళ్లడంతో విధుల నుంచి రమేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.

News February 13, 2026

తొర్రూర్: 9 వార్డులో మొత్తం 1282 ఓట్లు.. బీఎస్పీకి ఒక్క ఓటు రాలే!

image

తొర్రూర్ మున్సిపాలిటీలోని ​9వ వార్డులో అత్యంత ఉత్కంఠ పోరు నెలకొంది. 9వ వార్డు SC-W రిజర్వ్డ్ అయింది. అయితే, బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కిన్నెర కవిత 451 ఓట్లు సాధించి, కేవలం 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన(438 ఓట్లు)పై విజయం సాధించారు. ​ఈ వార్డులో మొత్తం 1282 ఓటర్లు ఉండగా.. 901 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 12 ఓట్లు రాగా.. బీఎస్పీకి ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం.

News February 13, 2026

ఈనెల 15 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ కింద మెటీరియల్ పేమెంట్లను ఈనెల 15 నాటికి రూ.22.68 కోట్ల మేర పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు ఆదేశించారు. రోజుకు సుమారు రూ.7.35 కోట్ల పనులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెలవు దినాలైనా సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పాత పనులు పూర్తిచేసి పేమెంట్లు క్లియర్ చేయాలన్నారు.