News March 20, 2024

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని?

image

నేడో, రేపో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కొందరు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. విజయవాడ తెలుగుదేశం-బీజేపీ-జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో విజయవాడ టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News April 3, 2025

వారసత్వ సంపద గల నగరం మచిలీపట్నం: కలెక్టర్ 

image

మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరు కోటను పర్యాటక సర్క్యూట్‌లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోట, డచ్ సమాధులను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బందరుకోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు.    

News April 3, 2025

నాగాయలంక: రూ.13.50లక్షల నిధులు దుర్వినియోగం 

image

నాగాయలంక పీఏసీఎస్‌లో రూ.13.50 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తన తనిఖీలో గుర్తించామని మచిలీపట్నం కేడీసీసీ బ్యాంక్ విచారణాధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. గురువారం నాగాయలంక కేడీసీసీ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో తాను ఆడిట్ అధికారిగా వచ్చి నాగాయలంక పీఎసీఎస్‌లో పలు రికార్డులను తనిఖీ చేయగా, ఎరువుల స్టాక్‌లో వ్యత్యాసాలు, మొత్తాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 

News April 3, 2025

విజయవాడ: మహిళ హత్య.. నిందితుడి అరెస్ట్

image

పటమటలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటమట పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి అనే మహిళ తన భర్తతో కలిసి కాగితాలు ఏరుకొని జీవనం సాగించేది. వాంబే కాలనీకి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మిని శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. ఒప్పుకోకపోవడంతో మంగళవారం రాత్రి మద్యం తాగి విచక్షణారహితంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు.

error: Content is protected !!