News February 6, 2025

విజయవాడ: డిజిటల్ అరెస్టుతో భారీ మోసం 

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.48 కోట్లు దోచేశారు. భారతీ నగర్‌కు చెందిన ఓ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు మీపై కేసు నమోదైందంటూ ఆ వ్యక్తి నుంచి రూ.3.46 లక్షలు ఓసారి, రూ.కోటి మరోసారి, ఆ తర్వాత రూ.25 లక్షలు, రూ.2 లక్షలు, రూ.20 లక్షలు జమ చేయించుకున్నారు. దీంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు BNGLR, HYD, KOLAKATAలలో బ్యాంకుల్లోకి వెళ్లినట్లు తేలింది. 

Similar News

News February 6, 2025

NLG: దేవుడా.. అప్పుడే మండుతున్న ఎండలు

image

చలికాలం పూర్తికాక ముందే ఎండలు మొదలయ్యాయి. ఫిబ్రవరి తొలివారంలోనే పగటి పూట 40 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. బుధువారం నల్గొండ (D) అనుముల మం. ఇబ్రహీంపేటలో 37.4, యాదాద్రి (D)బొమ్మలరామారంలో 37.3, సూర్యాపేట (D) నూతన్‌కల్‌లో 37.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయంపూట దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఈ విచిత్ర వాతావరణంలో ప్రజలులు అవస్థలు పడుతున్నారు.

News February 6, 2025

నిజామాబాద్‌లో చికెన్ ధరలు

image

నిజామాబాద్‌లో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్‌లెస్ KG రూ.220 నుంచి రూ.240, విత్ స్కిన్ రూ.200 నుంచి రూ.210 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. అయితే, బాన్సువాడలో వైరస్ ప్రభావంతో కామారెడ్డిలో KG రూ. 180కి పడిపోవడం గమనార్హం. ఇంతకీ మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి.?

News February 6, 2025

కాంగ్రెస్ రాకతో పాత కష్టాలు: కేటీఆర్

image

TG: రాష్ట్ర సచివాలయంలోనే కాదు గ్రామ సచివాలయాల్లోనూ పాలన పడకేసిందని మాజీ మంత్రి కేటీఆర్ Xలో విమర్శించారు. గ్రామాలన్నీ సమస్యల ఊబిలో చిక్కుకున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, కాంగ్రెస్ వచ్చి పాత కష్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. సీఎం ఇకనైనా మొద్దునిద్ర వీడాలని, గ్రామాల్లో సమస్యల పంచాయితీని తేల్చాలని రాసుకొచ్చారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

error: Content is protected !!