News April 25, 2024
విజయవాడ: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసిన సీపీ రామకృష్ణ

విజయవాడ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రామకృష్ణ నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. విజయవాడలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీకి సూచనలు చేశారు.
Similar News
News September 11, 2025
కృష్ణా జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ ఫెన్సింగ్ జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 19 ఫెన్సింగ్ జట్ల ఎంపికలను కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడా కారులు పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో పీఈటీలు నాగరాజు, దీపా, వెంకట్రావ్ పాల్గొన్నారు.
News September 11, 2025
కృష్ణా: ప్రారంభమైన జెడ్పీ సర్వసభ్య సమావేశం

కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్‌తోపాటు మూడు జిల్లాల అధికారులు హాజరయ్యారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభమైంది.
News September 11, 2025
కృష్ణా: పెరిగిన గోల్డ్ రేట్స్.. భయపెడుతున్న దొంగతనాలు

కృష్ణా జిల్లాలో రోజురోజుకు గొలుసు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. గన్నవరం, బాపులపాడులలో పట్టపగలు మహిళల గొలుసులు లాక్కుని దొంగలు పారిపోయారు. ప్రస్తుతం బంగారం గ్రాము ధర రూ.10 వేలు దాటడంతో మహిళలు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఈ క్రమంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, బస్సులలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.