News January 31, 2025

విజయవాడ: డ్రోన్లతో ఈవ్ టీజింగ్‌కు అడ్డుకట్ట 

image

ఆధునిక సాంకేతికత ఉపయోగించి నేరాలను కట్టడి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు గురువారం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. డ్రోన్లతో స్కూల్స్, కాలేజీ పరిసరాలలో ఈవ్ టీజింగ్‌ జరగకుండా, బహిరంగ ప్రదేశాలలో మద్యం/ గంజాయి సేవించే వ్యక్తులను గుర్తిస్తున్నామని తెలిపారు. డ్రోన్లతో పహారా కాస్తూ అసాంఘిక కార్యక్రమాలు జరుగు ప్రదేశాలు గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 

Similar News

News July 5, 2025

ఐశ్వర్యరాయ్‌తో విడాకులపై స్పందించిన అభిషేక్!

image

బాలీవుడ్ క్యూట్ కపుల్ అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అభిషేక్ పరోక్షంగా స్పందించారు. ‘సోషల్ మీడియాలో వచ్చే రూమర్లకు మేము అంతగా ప్రాధాన్యత ఇవ్వం. ఇలాంటి వార్తలు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. నా భార్య, తల్లి కూడా బయట జరిగే విషయాలు ఇంట్లోకి తీసుకురారు. ప్రస్తుతం మా కుటుంబమంతా కలిసి హ్యాపీగా జీవిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News July 5, 2025

జమ్మికుంట: Way2News ఎఫెక్ట్.. సమయ సూచిక ఫ్లెక్సీ ఏర్పాటు

image

జమ్మికుంట బస్టాండ్ ప్రారంభమై 37 ఏళ్లు అయినా సమయ సూచిక బోర్డును మార్చలేదు. దీనిపై <<16829076>>గత నెల 26న<<>> Way2Newsలో “బస్టాండుకు 37 ఏళ్లు.. మారని సమయ సూచిక” అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్టీసీ అధికారులు బస్సులు బయలుదేరే సమయ సూచిక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు Way2Newsకు కృతజ్ఞతలు తెలుపుతూ.. బస్టాండ్ ఇరుకుగా ఉందని, దీనిని విస్తరింపజేసి ఈ సమస్యనూ తీర్చాలని కోరుతున్నారు.

News July 5, 2025

ములుగు: ‘లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

జిల్లాలో వర్షాకాలంలో ప్రమాదాల నివారణకు తక్షణ సహాయం కోసం కంట్రోల్ రూమ్ 1800 4257109 నంబర్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ప్రజలందరూ జిల్లా అధికార వాట్సాప్, ఛానల్‌ను చేసుకోవాలని సూచించారు. రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.