News October 10, 2025

విజయవాడ: దుర్గమ్మకు.. రెండు కోట్ల వజ్రాభరణాలు

image

రాబోయే వారం దుర్గమ్మకు ఒక ప్రముఖ వజ్రాభరణాల సంస్థ రూ. 2 కోట్లకు పైగా విలువైన ఆభరణాలను అందించనుంది. ఇందులో ముక్కుపుడక, మంగళసూత్రాలు వంటి వజ్రాభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాలను దేవస్థానంలో ఒక వేడుకగా అందజేయాలని సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి అభివృద్ధి ప్రణాళికలు, ప్రధాన ఆలయానికి స్వర్ణ తాపడం వంటి అంశాలను అధికారులు వివరించనున్నారు.

Similar News

News October 10, 2025

ఏలూరు: బాత్‌రూమ్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

ఏలూరు శనివారపు పేటకు చెందిన ఆటో డ్రైవర్ ఎర్ర వెంకటేశ్వరరావు (48) శుక్రవారం స్నానాల గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమవరంలో కూతురు బీటెక్ చదువుతుండటంతో 9 నెలలుగా భార్యతో సహా వెంకటేశ్వరరావు అక్కడే ఉంటున్నారు ఇటీవల వ్యక్తిగత పనులపై ఆయన ఏలూరు వచ్చి ఉంటున్నాడు. త్రీ టౌన్ సీఐ కోటేశ్వరరావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 10, 2025

HYD: సిలిండర్ సమస్యలపై ఫిర్యాదు చేయండి!

image

ఓ వ్యక్తికి డెలివరీ అయిన సిలిండర్ లీకేజీ జరుగుతుందని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏంటి ఇంత అధ్వానంగా సిలిండర్ పంపిస్తారా.? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అధికారులు, HYDలో సిలిండర్ సమస్యలు ఏర్పడితే https://www.mopnge-seva.in/ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News October 10, 2025

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

సౌత్ ఇండియన్ బ్యాంక్‌ జూనియర్ ఆఫీసర్/ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. ఢిల్లీ NCR, మహారాష్ట్రలో ఉద్యోగాలున్నాయి. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruit.southindianbank.bank.in/