News August 20, 2025
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో.. RMPనే పెద్ద వైద్యుడు!

రాష్ట్రంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో వైద్య సేవలు నామమాత్రంగా ఉన్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా భక్తులు వస్తున్నా, వారికి వైద్యం అందించేందుకు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. కేవలం ఓ ఆర్‌ఎంపీ మాత్రమే సేవలు అందిస్తుండగా, ఉన్న ఒక్క అంబులెన్సులోనూ సౌకర్యాలు లేవు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున తక్షణం శాశ్వత వైద్యులను నియమించాలని కోరుతున్నారు.
Similar News
News August 20, 2025
‘జూబ్లీహిల్స్ టికెట్ నాదే.. లేదు నాది..!’

త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రతీ డివిజన్‌లో సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని కీలక నేతలు తమకే టికెట్ అన్నట్లు ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి రేసులో అంజన్ కుమార్ యాదవ్, ఆజారుద్దీన్, నవీన్‌యాదవ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు నేతలు ఢిల్లీ పెద్దలను కలిస్తున్నారు
News August 20, 2025
ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం: FRO

గండీడ్ మండలంలో ఓ వ్యక్తిపై నిన్న చిరుత పిల్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ‘Way2News’ మహమ్మదాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మహమ్మద్ అబ్దుల్ హైను సంప్రదించింది. దీంతో అధికారి మాట్లాడుతూ.. చిరుతనా? కాదా పరిశీలిస్తామన్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి తెలుసుకుంటామన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
News August 20, 2025
HYD: కేబుల్ వైర్లు తెగాయి.. సేవలు నిలిచాయి

రామంతపూర్, అంబర్‌పేట్ విద్యుత్ ప్రమాదాలతో విద్యుత్‌శాఖ చేపట్టిన చర్యలతో నగర వ్యాప్తంగా కేబుల్ వైర్లు ఎక్కికక్కడ కట్ అవుతున్నాయి. దీంతో వైర్ల ద్వారా నడిచే ప్రసారాలు నిలిచిపోయాయి. అత్యవసరం ఉన్నవారి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు మేడ్చల్ వాసి కర్కి రమేశ్ తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాక కేబుల్ వైర్ల తొలగింపు చేపట్టాలని కోరారు. సిబ్బంది వాహనాల్లో భారీగా తొలగించిన కేబుల్ వైర్లను తరలిస్తున్నారు.