News September 25, 2025
విజయవాడ: దుర్గమ్మ గుడిలో గంటసేపు దర్శనాలు నిలిపివేత

ఇంద్రకీలాద్రిపై సా.6.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు గంట పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. నివేదన, పంచ హారతుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రోటోకాల్ మార్గంలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున బయటి వ్యక్తులు వస్తుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రోటోకాల్ గేట్‌కి ఎండోమెంట్ కమిషనర్ తాళం వేయించారు. మీడియా వారిని సైతం లోపలికి అనుమతించలేదు.
Similar News
News September 26, 2025
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో ఈనెల 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గుంటూరు కలెక్టర్ తమిమ్ అన్సారియా గురువారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పిల్లలు, పశువులను నీటి ప్రవాహాల వద్దకు పంపకూడదని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని పేర్కొన్నారు. మండల, డివిజినల్ అధికారులు స్థానిక స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ నం. 0863-2234014 కి సమాచారమివ్వాలని తెలిపారు.

26న రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు పంపిణీ

తుళ్లూరు: భూ సమీకరణ పథకంలో భూములను ఏపీ సీఆర్డీఏకు అప్పగించిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తున్నట్టు సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబు గురువారం తెలిపారు. ఈ నెల26వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ – లాటరీ జరుగుతుందన్నారు. 56 మంది రైతులకు 104 ప్లాట్లను పంపిణీ చేయనున్నారు.