News October 12, 2025
విజయవాడ: దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు

దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ, అమ్మవారి ఆలయంలో దసరా రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో దుర్గగుడి దేవస్థానంలో వేకువ జాము నుంచే భక్తుల రద్దీ పెరిగింది. ఈ రద్దీ దృష్టిలో ఉంచుకుని, ఘాట్ రోడ్డు నుంచి నడుచుకుంటూ వచ్చిన దేవస్థానం EO, సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, కార్ల ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. అన్ని దర్శనం టికెట్లను రద్దు చేసి, భక్తులకు ఉచితంగా అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు.
Similar News
News October 12, 2025
MDCL: పిచ్చి మొక్కలతో ప్రకృతి వనాలు..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణ, పల్లె ప్రకృతి వనాలలో పిచ్చి మొక్కలే కానొస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల అటవిని తలపిస్తున్నాయి. మున్సిపాలిటీలలో కనీసం పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు. వాకింగ్ ట్రాక్స్ మొత్తం మూత పడిపోయాయి. దీనిపై యంత్రాంగం తగినట్లు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
News October 12, 2025
ఆదిలాబాద్‌లో బడా రియాల్టర్లపై కేసు

భూ కబ్జా కేసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పు చేసిన భూకబ్జా దారులందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చాక రియల్టర్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా ఎస్.బి.ఐ బ్యాంకు అధీనంలోని భూమిని కబ్జా చేసిన ఘటనలో ఆదిలాబాద్‌కు చెందిన మామ్లా సెట్, రమేశ్ శర్మతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 12, 2025
ASF జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలి రేసులో సుగుణ

ASF జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలి రేసులో సుగుణ పేరు వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. పైగా MPగా పోటీ చేసి ఓడిపోవడంతో అధిష్టానం వద్ద ఆమెకు సింపతీ ఉంది. దీంతో ఆమెకే అధ్యక్ష పదవి ఖారారని పలు వర్గాల్లో చర్చనడుస్తోంది. కాగా ఇప్పటికే ఆమెకు TPCC ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంతో అధ్యక్ష పదవిని మరెవరికైనా ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.