News June 25, 2024

విజయవాడ: నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

విజయవాడలో ఎలాంటి అనుమతులు, ప్లాన్ అప్రూవల్ లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారంటూ నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యాధరపురం కార్మిక శాఖ స్థలంలో కనీసం ప్లాన్ అప్రూవల్ కూడా లేకుండా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం పూర్తిగా అక్రమ నిర్మాణమని అధికారులు పేర్కొన్నారు. 7 రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామని వారు వెల్లడించారు.

Similar News

News June 29, 2024

విద్యా వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళన: మంత్రి లోకేశ్

image

ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేశ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.

News June 29, 2024

చంద్రబాబును కలిసిన TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

image

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

News June 28, 2024

కైకలూరులో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

మండలంలోని ఉప్పుటేరు చెక్‌పోస్ట్ సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కైకలూరు మండలం గుమ్మళ్లపాడుకు చెందిన యాళ్ల దేవరాజు (40) ద్విచక్ర వాహనంపై ఆకివీడు నుంచి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో.. ఉప్పుటేరు వద్ద వెనక నుంచి లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ రామకృష్ణ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.