News February 18, 2025
విజయవాడ: నేడు సబ్ జైలు వద్దకు రానున్న జగన్

విజయవాడకు నేడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో సబ్ జైల్లో ములాకత్ అవనన్నారు. ఉదయం 9:30 గంటలకు సబ్ జైల్లో వంశీని జగన్ పరామర్శించనున్నారు. జగన్ గాంధీనగర్‌లోని సబ్ జైల్ వద్దకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌తో పాటు రాష్ట్రంలోని పలువురు వైసీపీ నేతలు సబ్ జైలు వద్దకు రానున్నారు.
Similar News
News September 17, 2025
ASF: నిజాం నిరంకుశత్వంపై సాధించిన విజయమే తెలంగాణ విమోచనం: బీజేపీ

తెలంగాణ ప్రజలకు అష్ట కష్టాలు పెట్టిన నిజాం, రజాకారుల దాష్టికాల నుంచి తెలంగాణ విమోచనం జరిగిందని BJP జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. విమోచన దినం సందర్భంగా ఆసిఫాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. చాకలి ఐలమ్మ వంటి ఎంతో మంది వీరమాతలు రజాకార్లపై తిరగబడి సాధించిన తెలంగాణ ఇది అన్నారు.
News September 17, 2025
అమరావతి: అసైన్డ్ రైతులకు ఊరట

అమరావతి రాజధాని కోసం తమ అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. గతంలో రిటర్నబుల్ ప్లాట్లలో ‘అసైన్డ్’ అని పేర్కొనడంతో అవి అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చట్టంలోని 9.24లోని కాలమ్ నంబర్ 7, రూల్ నంబర్ 11(4) క్లాజ్‌ను తొలగిస్తూ జీవో నంబర్ 187ను బుధవారం విడుదల చేసింది.
News September 17, 2025
‘రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని 3,03,568 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ. 305.98 కోట్లు ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద జమ చేశామని పేర్కొన్నారు. దీంతోపాటు, ప్రభుత్వం జిల్లాలో 1,96,554 మంది రైతులకు పంటల బీమా కల్పించిందని, ఇది ఆపత్కాలంలో రైతులకు అండగా ఉంటుందని తెలిపారు.