News October 17, 2025
విజయవాడ: నైపుణ్య కోర్సులలో యువతకు ఫ్రీ కోచింగ్

నున్నలోని సీడాప్ శిక్షణ కేంద్రంలో హోటల్ మేనేజ్‌మెంట్, టాలీ, టెక్నిషియన్, సాఫ్ట్ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శిక్షణ అధికారి ధనలక్ష్మి తెలిపారు. SSC ఆపైన చదివి 18- 30 ఏళ్లలోపువారు ఈ శిక్షణలో చేరవచ్చని..ఉచిత హాస్టల్, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని..వివరాలకు 8142602179 నెంబరులో సంప్రదించాలని ఆమె సూచించారు.
Similar News
News October 17, 2025
వసతి గృహ భవనాల ముఖచిత్రం మారాలి: కలెక్టర్

ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖ చిత్రాలు మారాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. ఇంజనీరింగ్, సంక్షేమ శాఖలతో శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భవనాల్లో ఉన్న 20 సాంఘిక సంక్షేమ, 8 బిసి సంక్షేమ, 3 గిరిజన సంక్షేమ వసతి గృహాలలో సహా అంగన్వాడీ కేంద్రాలలో అవసరమగు మౌలిక సదుపాయాలు గుర్తించాలని నివేదికలు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News October 17, 2025
VKB: జిల్లా బీజేపీ కన్వీనర్‌గా కరణం ప్రహ్లాద రావు

వికారాబాద్ జిల్లా బీజేపీ కన్వీనర్‌గా కరణం ప్రహ్లాద రావు శుక్రవారం నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి కొప్పు రాజశేఖర్ రెడ్డి సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. అదేవిధంగా జిల్లా బీజేపీ కన్వీనర్‌గా కరణం ప్రహ్లాద రావును నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని అన్నారు.
News October 17, 2025
JNTUH విద్యార్థులకు ALERT

కూకట్‌పల్లిలోని JNTU 14వ స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 2024- 25 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి UG, PG, PHD పూర్తైన విద్యార్థులు డిగ్రీల కోసం నవంబర్ 30లోపు వర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు సూచించారు.