News April 11, 2024

విజయవాడ పశ్చిమలో అత్యధికం, మచిలీపట్నంలో అత్యల్పం

image

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమలో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీ పడగా, మచిలీపట్నంలో అత్యల్పంగా 8 మంది బరిలో నిలిచారు. జిల్లాల విభజన అనంతరం స్థానికంగా రాజకీయ పరిస్థితులు మారినందునా తాజా ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యపై ఆసక్తి నెలకొంది. కాగా గత ఎన్నికల్లో పశ్చిమలో 10 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలవడం విశేషం.

Similar News

News April 11, 2025

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు

image

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ రాజబాబును వెంటనే తొలగించాలని ఆదేశించారు. గడిచిన 10 నెలల కాలంలో గనుల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబుకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయగా రాజబాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను విధుల నుంచి తప్పించారు.

News April 11, 2025

తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు.!

image

తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి మచిలీపట్నం, మే 14 నుంచి 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం నుంచి తిరుపతికి స్పెషల్ రైలు నడవనుంది. ఈ రైలులో 2AC, 3AC, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సూచించింది.

News April 11, 2025

MTM: పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు 

image

మచిలీపట్నంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మార్చి నెల జరిగిన క్రైమ్ డిటెక్షన్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గంగాధరరావు రివార్డులు అందజేశారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, హెడ్ కానిస్టేబుల్ చంద్ర, కానిస్టేబుల్స్ బాజీ, మూర్తిలను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు. 

error: Content is protected !!