News October 8, 2025
విజయవాడ పశ్చిమ బైపాస్‌ను వేధిస్తున్న టవర్ల సమస్య

97% మేర పూర్తైన పశ్చిమ బైపాస్ పనులకు అపరిష్కృతంగా ఉన్న టవర్ల సమస్య ఆటంకంగా మారింది. రహదారి వెళ్లే మార్గంలోని హైటెన్షన్ ట్రాన్స్‌మిషన్ టవర్ల ఎత్తు పెంచితే మిగతా పనులు పూర్తి కానుండగా.. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అనుమతులు వస్తే మిగతా పనులు పూర్తై రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు.
Similar News
News October 8, 2025
APPLY NOW: ఇస్రోలో 20 పోస్టులు

ఇస్రో 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/
News October 8, 2025
వరంగల్: భారీగా తగ్గిన పలికాయ ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి చిరుధాన్యాలు నేడు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,140 ధర పలకగా ఈరోజు సైతం అదే ధర పలికింది. అలాగే, సూక పల్లికాయకు కూడా నిన్నటి లాగే రూ.6,610 ధర వచ్చింది. పచ్చి పల్లికాయకు మంగళవారం రూ.4,710 ధర పలకగా.. ఈరోజు భారీగా పడిపోయి రూ.4100 అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.
News October 8, 2025
కర్నూల్ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్

వైసీపీ టాక్స్-కర్నూల్ యూట్యూబ్ ఛానల్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బటన్ నొక్కారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.