News June 27, 2024

విజయవాడ పాస్ పోర్ట్ కార్యాలయానికి అవార్డ్

image

దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి అవార్డ్ దక్కింది. 2023-24లో రికార్డ్ స్థాయిలో 3.75లక్షల మందికి పాస్‌పోర్టులు జారీ చేసినందుకు గానూ అధికారి శివహర్ష 24న అవార్డు అందుకున్నారు. దేశంలోని 37 కార్యాలయాల్లో విజయవాడే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం విజయవాడలో 600 మంది సేవలు అందిస్తున్నట్లు.. త్వరలోనే రోజుకు 1200 మందికి సేవలు విస్తరిస్తామని అధికారులు చెప్పారు.

Similar News

News July 1, 2024

మండవల్లిలో జాతీయ రహదారిపై తిరగబడిన లారీ

image

మండవల్లిలో కైకలూరు సందు వద్ద జాతీయ రహదారిపై ధాన్యం లారీ తిరగబడింది. స్థానికుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి మరమ్మతుల్లో భాగంగా కైకలూరు సందు వద్ద రోడ్డు కటింగ్ పనులు చేస్తున్నారు. తణుకు నుంచి సింగరాయపాలెంకు ధాన్యం లోడుతో వెళుతున్న లారీ సాయంత్రం 6.30 సమయంలో మట్టిలో దిగబడి తిరగబడింది. వేసవిలో చేయాల్సిన పనులను కాంట్రక్టర్ వర్షాకాలంలో చేపట్టారని దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.

News July 1, 2024

తొలిరోజే పింఛన్ 100 శాతం పంపిణీ పూర్తిచేయాలి: క‌లెక్ట‌ర్ సృజ‌న

image

జులై 1వ తేదీన ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెన్ష‌న్ల మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల వ‌ద్దే అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న ఆదేశించారు. ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద చేప‌ట్టే సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్ టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. తొలిరోజే 100 శాతం పంపిణీ పూర్తిచేసేలా కృషిచేయాల‌న్నారు.

News July 1, 2024

నేటినుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కృష్ణా జిల్లా కలెక్టర్

image

జూలై 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరిస్తామని అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.