News January 7, 2026
విజయవాడ: పిల్లల విక్రయాల కేసులో ఇద్దరు అరెస్ట్

విజయవాడలో సంచలనం సృష్టించిన శిశువుల విక్రయాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితురాలు సరోజినీ వెల్లడించిన వివరాలతో ముంబయికి చెందిన కవిత, ప్రతాప్ జాదవ్ అనే మరో ఇద్దరు నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై వీరిని విజయవాడ తరలించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ ముఠాలోని మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
Similar News
News January 9, 2026
WGL: 19 నుంచి ఎంఏ తెలుగు సెమిస్టర్ పరీక్షలు

వరంగల్ హంటర్ రోడ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఈ నెల 19 నుంచి ఎంఏ తెలుగు రెగ్యులర్ కోర్సు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పీఠాధిపతి డా.గడ్డం వెంకన్న తెలిపారు. మొదటి సంవత్సరం వారికి తొలి సెమిస్టర్, రెండో సంవత్సరం వారికి మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. సంక్రాంతి సెలవులు ఈ నెల 10 నుంచి 17 వరకు ఉంటాయని తెలిపారు.
News January 9, 2026
తొక్కుడు బిళ్ల ఆడతారా?

AP: కనుమరుగవుతున్న సంప్రదాయ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కర్రా బిళ్ల, తొక్కుడు బిళ్ల, తాడాట, తాడు లాగుడు, ఏడు పెంకులాట, కర్రసాము, గాలిపటాలు ఎగిరేయడం లాంటి ఆటల పోటీలను నిర్వహించనుంది. శాప్ అధ్వర్యంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవి జరగనున్నాయి. అన్ని వయసుల వాళ్లూ పాల్గొనవచ్చు. విజేతలకు బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు.
News January 9, 2026
కామారెడ్డి జిల్లాలో రాత్రి ACCIDENT

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లింగంపేట మండలం సూరాయిపల్లికి చెందిన కూలీలు వరినాట్లు వేసేందుకు ఆటోలో భిక్కనూర్ మండలం అంతంపల్లికి వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా జిల్లా కేంద్రంలో ముందున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


