News January 20, 2025
విజయవాడ: పీజీఆర్ఎస్‌కు 92 ఫిర్యాదులు
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి 92 ఫిర్యాదులు వచ్చాయని డీసీపీ ఏబీటీఎస్. ఉదయారాణి తెలిపారు. ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News January 20, 2025
‘కుష్టు’ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం: కలెక్టర్
కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈనెల 20 నుంచి పిబ్రవరి 2వ తేది వరకు జిల్లాలో కుష్టు వ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకిని ‘కుష్టు’ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ కలెక్టరేట్‌లో కుష్టు వ్యాధి పరీక్షలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
News January 20, 2025
కృష్ణా: విద్యార్థులకు గమనిక.. పరీక్షల షెడ్యూల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో BA. LLB కోర్సు(2024-25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్(Y 18 నుంచి Y 21 బ్యాచ్‌లు) రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 10 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 27లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU సూచించింది.
News January 20, 2025
పమిడిముక్కల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పమిడిముక్కల మండలంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23), ముక్త దుర్గ బాబు(24) లు బైక్‌పై వెళ్తుండగా మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై కెసిపి ఫ్లైఓవర్ గోడను అదుపుతప్పి ఢీకొనడంతో మృతి చెందారు. కాకినాడ నుంచి హైదరాబాదుకు వెళ్తుండగా ఉదయాన్నే మంచు ప్రభావంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పమిడిముక్కల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.