News March 31, 2025

విజయవాడ: పున్నమి ఘాట్‌లో మృతదేహం 

image

కృష్ణానది పున్నమి ఘాట్ వద్ద గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైనట్లు భవానిపురం పోలీసులు తెలిపారు. పున్నమి ఘాట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడికి 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందన్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని, మృతుడి ఒంటిపై ఎరుపు కలర్ షర్ట్, చెక్స్ ప్యాంట్ ఉన్నాయన్నారు.  

Similar News

News September 19, 2025

జగన్‌లా గతంలో ఎవరూ ఇంట్లో కూర్చోలేదు: సోమిరెడ్డి

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలికి వచ్చి ప్రశ్నిస్తుంటే, మాజీ సీఎం జగన్ శాసనసభకు ఎందుకు రావట్లేదని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు. ప్రతిపక్ష హోదా కోసం గతంలో ఏ నాయకుడూ జగన్‌లా ఇంట్లో కూర్చోలేదని ధ్వజమెత్తారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేస్తే, ప్రతిపక్ష హోదా కావాలని కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

News September 19, 2025

భీమడోలు మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదు

image

ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటలలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భీమడోలు మండలంలో అత్యధికంగా 16.2 మి.మీ., నూజివీడులో 2.8 మి.మీ, చాట్రాయిలో 1.8 మి.మీ, అగిరిపల్లిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన 24 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 22.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 0.8 మి.మీ.గా ఉందని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు.

News September 19, 2025

సెట్టూరులో ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి

image

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.