News January 23, 2025
విజయవాడ పోలీసులకు చంద్రబాబు అభినందనలు
విజయవాడ పోలీసు చర్యలను సీఎం చంద్రబాబు అభినందించారు. Suraksha For Safer Neighbourhoods చొరవ అభినందనీయమని కొనియాడారు. వెయ్యికంటే ఎక్కువ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రాముఖ్యత చాటుతోందని చెప్పారు. ఈ తరహా పోలీసింగ్ పరిపాలన ప్రజలకు మెరుగైన సేవ చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. హైటెక్ ఈగల్ వెహికల్స్ ప్రారంభించడం కూడా ఆయన అభినందించారు.
Similar News
News January 23, 2025
కృష్ణా: కమిషనరేట్‌లో నేతాజీ జయంతి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మచిలీపట్నం పోలీస్ కమిషనరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర్ రావు, పోలీస్ సిబ్బంది సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలో ఉన్న ప్రేరణాత్మక ఘట్టాలను వివరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి మిఠాయి పంచిపెట్టారు.
News January 23, 2025
కృష్ణా: గమనిక..1వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ(2024-25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 18 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని ANU సూచించింది.
News January 23, 2025
జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్‌గా తీర్చిదిద్దుదాం: కలెక్టర్
ఎన్‌టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్‌గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ, ఆధ్వర్యంలో ఎనికేపాడులో జరిగిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన జనజాగృతి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్. వీర రాఘవయ్య ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్‌ను పరిశీలించారు.