News December 31, 2025
విజయవాడ పోలీస్ కమిషనరేట్ ‘ఫ్యూచర్ విజన్-2026’

విజయవాడ పోలీస్ కమిషనరేట్ నగర భద్రతను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ విజన్-2026’ను ప్రకటించింది. స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్విజిబుల్ పోలీసింగ్, ప్రిడిక్టివ్ ప్రొటెక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ నియంత్రణ, ముందస్తు నేర నివారణ, డ్రోన్ నిఘా, ప్రవర్తనా విశ్లేషణలతో ప్రజలకు కనిపించకుండా భద్రత కల్పించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు.
Similar News
News January 1, 2026
యుద్ధంలో గెలిచేది మేమే: పుతిన్

ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో గెలిచేది తామేనని దేశం భావిస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో పోరాడుతున్న హీరోలను(సైనికులు) సపోర్ట్ ప్రజలను చేయాలని కోరారు. ‘మేం మీపై, మన విజయంపై నమ్మకం ఉంచుతున్నాం’ అని సోల్జర్లను ఉద్దేశించి న్యూఇయర్ ప్రసంగంలో అన్నారు. తన నివాసంపై ఉక్రెయిన్ <<18728652>>డ్రోన్ దాడి<<>> గురించి ఆయన ప్రస్తావించలేదు. పుతిన్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 31తో 26 ఏళ్లు పూర్తయ్యాయి.
News January 1, 2026
సంగారెడ్డి: దరఖాస్తు గడుపు పెంపు

ఇంటర్ ఆపైన చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువు మార్చి 31వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి బుధవారం తెలిపారు. విద్యార్థులు ఉపకార వేతనాల కోసం http://telanganaepass.cgg.gov వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 1, 2026
ఆపరేషన్ సిందూర్.. ప్రపంచానికి సందేశం: రక్షణ శాఖ

ఉగ్రవాదంపై పోరులో ఇండియా సంకల్పానికి ఆపరేషన్ సిందూర్ గొప్ప నిదర్శనమని రక్షణ శాఖ తెలిపింది. కచ్చితత్వం, నైపుణ్యంతో మన బలగాలు పాక్ ఉగ్ర స్థావరాల గుండెల్లోకి లోతుగా దూసుకెళ్లి దెబ్బకొట్టాయని చెప్పింది. ‘ఈ ఆపరేషన్ ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపింది. భారత్ ఉగ్రవాదాన్ని సహించదని, దాన్ని ప్రోత్సహించే వారు ప్రతీకార చర్యను ఎదుర్కోవాల్సిందేనని తెలియజేసింది’ అని ఇయర్ ఎండ్ రివ్యూ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.


