News April 25, 2024
విజయవాడ పోలీస్ కమీషనర్‌గా రామకృష్ణ నియామకం
విజయవాడ పోలీస్ కమీషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రామకృష్ణ ని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలలోపు విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న కాంతి రానా టాటాను ఎన్నికలకు సంబంధం లేని విధులు అప్పగించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News December 25, 2024
RGVకి 15 రోజులు టైం ఇచ్చాం: జీవీ రెడ్డి
ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వ హాయంలో ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి అక్రమంగా డబ్బు చెల్లించారు. డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆయనకు 15 రోజుల సమయం ఇచ్చాం. గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. గత ప్రభుత్వం నియమించిన 410 మందిని తొలగిస్తాం’ అని తెలిపారు.
News December 25, 2024
జాతీయ షూటింగ్ పోటీలకు కృష్ణ జిల్లా క్రీడాకారులు
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా పట్టణంలో జరగబోయే 43వ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణాజిల్లా బాల బాలికలు ఎంపికైనట్లు జిల్లా షూటింగ్ బాల్ సంఘం అధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం వారిని ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురువ పరశురాముడు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీలు డిసెంబర్ 27న తేదీ నుంచి 29 వరకు జరుగుతాయన్నారు.
News December 24, 2024
కృష్ణ: కారు ఢీ కొని.. ప్రభుత్వ టీచర్ దుర్మరణం
మండలంలోని పెడసనగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వి.రామకృష్ణను సోమవారం కంకిపాడు టోల్ ప్లాజా వద్ద కారు ఢీ కొట్టింది. గాయాలపాలైన ఆయనను సిటీ న్యూరో సెంటర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స అందుతుండగా ఆయన మంగళవారం మరణించారని మొవ్వ మండల ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.