News December 8, 2025

విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ)- షాలిమార్(SHM)(నం.07148,49) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 9.35 గంటలకు CHZలో బయలుదేరే ఈ ట్రైన్ 9వ తేదీన ఉదయం 3.20కి విజయవాడ, రాత్రి 11.50 గంటలకు SHM చేరుకుంటుందన్నారు, 10న మధ్యాహ్నం 12.10కి SHMలో బయలుదేరి 11న ఉదయం 7.40కి విజయవాడ, సాయంత్రం 4 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందన్నారు.

Similar News

News December 10, 2025

NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

<>NTPC<<>> 15 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/ బీటెక్( ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/

News December 10, 2025

KNR: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాలకు నగరవాసులు

image

ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా పలు మండలాల్లో రేపు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పట్టణాల్లో ఉంటున్న వాసులు పెద్దసంఖ్యలో తమ గ్రామాలకు పోలింగ్‌కు ముందే చేరుకుంటున్నారు. అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్, ప్రయాణ ఖర్చుల భరోసా వంటి కారణాలతో గ్రామాలవైపు రద్దీ పెరిగింది. స్నేహితులు కూడా పరస్పరం సంప్రదించుకుని కలిసి వెళ్లే ఏర్పాట్లు చేస్తుండగా పలువురు ఉద్యోగులు సెలవులు తీసుకుని స్వగ్రామాలకు చేరుతున్నారు.

News December 10, 2025

కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

image

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్‌ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.