News December 16, 2024
విజయవాడ: ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ లక్ష్మిశ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734339243666_51824121-normal-WIFI.webp)
విజయవాడలోని కలెక్టరేట్లో సోమవారం PGRS-పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టంలో భాగంగా ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మిశ అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారులు ఇచ్చిన గ్రీవెన్సులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నిధి మీనా, DRO ఎం.లక్ష్మి నరసింహం, DRDA పీడీ ఎస్.శ్రీనివాసరావు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 5, 2025
ఉయ్యూరు: కాలువలో పడి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738680163076_71682002-normal-WIFI.webp)
ఉయ్యూరు సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సుందరయ్య నగర్‌కు చెందిన ఎడ్ల రాంబాబు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మంగళవారం కాలువ అరుగు పై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు కాలంలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.
News February 5, 2025
కృష్ణా: కేంద్ర పథకాలపై అన్ని శాఖలు దృష్టి సారించాలి- కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738676645497_60300469-normal-WIFI.webp)
ప్రజల సంక్షేమాభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల ప్రగతితో పాటు ప్రజలకు అవగాహన లేకుండా మరుగున పడిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో చర్చించారు.
News February 4, 2025
గుడివాడ: లారీ ఢీకొని వ్యక్తి గుర్తుతెలియని మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738679220782_52120844-normal-WIFI.webp)
గుడివాడ మార్కెట్ సెంటర్లో మంగళవారం సాయంత్రం టిప్పర్ ఢీకొని సైక్లిస్ట్ మృతి చెందాడు. ఏలూరు రోడ్లో నుంచి పామర్రు రోడ్డు వైపు వెళ్తున్న టిప్పర్ మార్కెట్ సెంటర్లోని కటారి సత్యనారాయణ చౌకు వద్ద మలుపులో సైకిల్ మీద వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.