News November 10, 2025
విజయవాడ బస్‌స్టాండ్‌లో బొమ్మ పడబోతోంది.. వచ్చే నెల నుంచే!

విజయవాడ బస్టాండ్‌లోని రెండు మినీ థియేటర్లు సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ తెరచుకోనున్నాయి. ఇటీవల రూ.2.5 లక్షలకు టెండర్లు దక్కించుకోవడంతో ప్రస్తుతం రిపేర్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు లేదా డిసెంబర్ తొలి వారంలో సినిమా ప్రదర్శనలు ప్రారంభిస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెండు థియేటర్లలో కలిపి 200 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి.
Similar News
News November 10, 2025
ట్రాన్స్‌జెండర్లకు ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డుల పంపిణీ

జిల్లా దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సుమారు 30 మంది ట్రాన్స్‌జెండర్లకు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. 2019 హిజ్రాల చట్టం ప్రకారం వారికి సమాజంలో గౌరవం కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ పోర్టల్ ద్వారా వీటిని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
News November 10, 2025
NZB: 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

జిల్లాలో ఇప్పటికే దాదాపు 50% మేర 3.47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.
News November 10, 2025
అనకాపల్లి ఎస్పీ ఆఫీసుకి 50 ఫిర్యాదులు

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 50 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలు 19, కుటుంబ కలహాలు 2, మోసం 2, ఇతర విభాగాలకు చెందినవి 27గా గుర్తించారు. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి, 7 రోజుల్లో విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు.


