News September 9, 2025

విజయవాడ: బీచ్‌లో యువకుడి మృతి

image

విజయవాడ నుంచి బాపట్ల సూర్యలంక తీరానికి వచ్చిన యువకుడు అలల తాకిడికి గల్లంతై మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. విజయవాడ నుంచి వచ్చిన సాయి తీరంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యాడు. గల్లంతయిన యువకుడి కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు ప్రారంభించగా కాసేపటికి మృత దేహం లభ్యమైంది.

Similar News

News September 9, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్

image

ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఈ ఉదయం 10 గం. నుంచి సా.5 గంటల వరకు ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 768 ఓట్లు పోల్ అయ్యాయి. సా.6 గం. నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ముగిశాక ఈసీ అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

News September 9, 2025

అనంతపురం జిల్లాలో రేపు సెలవు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేపు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలకు DEO ప్రసాద్‌బాబు సెలవు ప్రకటించారు. నగరంలో లక్షల మందితో జరగనున్న ‘సూపర్-6, సూపర్ హిట్’ విజయోత్సవ సభకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో సెలవు ఇచ్చినట్లు తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. రెండో శనివారం 13న పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు.

News September 9, 2025

వనపర్తి: 13న జాతీయ మెగా లోక్ అదాలత్

image

ఈనెల 13న జరుగు జాతీయ మెగాలోక్ అదాలత్‌‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీ మార్గమే రాజ మార్గం అన్నారు. కొట్టుకుంటే ఒకరే గెలుస్తారు, రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని, రాజీతో సమయాన్ని డబ్బులను ఆదా చేసుకోవచ్చన్నారు. వివాదాలు అనేవి పెంచుకుంటే జీవితకాలం కొనసాగుతాయి.. ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఓ నిర్ణయానికి వస్తే అప్పుడే సమసిపోతాయన్నారు.