News December 23, 2025

విజయవాడ: మందుల కోసం బారులు.. నేతలకు కానరాని సమస్య!

image

విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో మందులు కోసం ప్రజలు బారులుతీరారు. ఒకే కౌంటర్ ఉండటంతో మందులు కోసం 2 గంటలు లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. అత్యవసరంగా మందులు అవసరమైనా అందని పరిస్థితి. అయితే ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలాంటి సమస్యలు వారి దృష్టిలోకి రాకపోవడం, కనిపించకపోవడం గమనార్హం.

Similar News

News December 23, 2025

విద్యుత్ ఛార్జీలు తగ్గించండి… ఇరిగేషన్ శాఖ లేఖ

image

TG: ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సరఫరా అయ్యే విద్యుత్‌పై అదనపు ఛార్జీలను తగ్గించాలని ఇరిగేషన్ శాఖ విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాసింది. నెలకు KVAకు ₹300 చొప్పున వసూలు చేయడాన్ని ఆపాలంది. యూనిట్ విద్యుత్‌కు వసూలు చేస్తున్న ₹6.30 సుంకాన్నీ తగ్గించాలని పేర్కొంది. ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్లకు సరఫరా అవుతున్న విద్యుత్ లోడ్ 2819.80 MWగా ఉంది. 2026లో ఇది 7348 MWకు చేరుతుందని అంచనా.

News December 23, 2025

ఇదే లాస్ట్ ఛాన్స్: అక్రమ వలసదారులకు US వార్నింగ్

image

అక్రమ వలసదారులు ఏడాది చివరికి స్వచ్ఛందంగా దేశాన్ని వీడేందుకు రిజిస్టర్ చేసుకుంటే 3వేల డాలర్లు ఇస్తామని ట్రంప్ సర్కారు ప్రకటించింది. స్వదేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఫ్రీగా ఇస్తామని చెప్పింది. సెల్ఫ్ డిపోర్టేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్పటివరకు చెల్లించే వెయ్యి డాలర్లను $3వేలకు పెంచింది. దేశాన్ని వీడేందుకు వారికి ఇదే చివరి అవకాశమని, తర్వాత అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News December 23, 2025

ANU CDE పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు CDE సమన్వయకర్త రామచంద్రన్ తెలిపారు. UG, PG 1, 2, 3, 4, 5 సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.