News December 19, 2025

విజయవాడ: మాతృత్వాన్ని మరచిన సరోజ..!

image

విజయవాడ కబేళా సెంటర్‌కు చెందిన బలగం సరోజ అలియాస్ సరోజిని పిల్లల విక్రయ ముఠాకు ప్రధాన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. పిల్లల అక్రమ విక్రయాన్ని ఆదాయ వనరుగా మలుచుకుంది. తల్లి ఒడిలో ఉండాల్సిన అభం శుభం తెలియని చిన్నారులను వేలం వేసి విక్రయిస్తోందని దర్యాప్తులో వెల్లడైంది. మహిళగా మాతృత్వాన్ని విస్మరించి, నెలలు నిండని పిల్లలను అక్రమంగా విక్రయిస్తూ మరోసారి పోలీసుల చేతికి చిక్కింది.

Similar News

News December 26, 2025

ఏలూరు: ఆపదొస్తే ఈ నంబర్లతో రక్షణ

image

బాల్యం నుంచే ధృడమైన మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విద్యార్థులకు సూచించారు. వట్లూరులోని పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ‘వీర్ బాల దివస్’లో ఆమె పాల్గొన్నారు. ర్యాగింగ్, అఘాయిత్యాల నిరోధానికి 1098, గృహ హింస నుంచి రక్షణకు 181 హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయం రక్షణ చర్యలపై ఆమె అవగాహన కల్పించారు.

News December 26, 2025

‘మెంతో ప్లస్’ డబ్బా మింగిన పసివాడు.. ప్రాణం కాపాడిన GGH వైద్యులు

image

కాకినాడ GGHలో 8 నెలల బాలుడు ప్రమాదవశాత్తు ‘మెంతో ప్లస్’ డబ్బాను మింగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిదండ్రుల వద్ద ఉన్న బాలుడు దీనిని మింగగా, అటెండర్ వెంటనే గుర్తించారు. సీఎంఓ డాక్టర్ సుష్మ ఆధ్వర్యంలో వైద్య బృందం అప్రమత్తమై, అత్యవసరంగా డబ్బాను బయటకు తీసి బాలుడిని కాపాడారు. సకాలంలో స్పందించి ప్రాణదాతలుగా నిలిచిన వైద్యులను రోగులు, బాలుడి తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా అభినందించారు.

News December 26, 2025

సంగారెడ్డి: JAN 10 నుంచి సెలవులు.. DEO హెచ్చరిక

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సెలవు దినాల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.