News January 28, 2025

విజయవాడ మీదుగా నడిచే రెండు రైళ్లు రద్దు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.22648 కోచువెల్లి- కోర్బా ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 3, 6, 10న, నం.22647 కోర్బా- కోచువెల్లి ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 5, 8, 12న రద్దు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News September 15, 2025

HYD: సబ్సిడీ.. అర్హులకు ఎప్పుడు?

image

అర్హులైన వారికి రూ.500కే సిలిండర్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ, గ్రేటర్ HYD పరిధిలో సుమారు 60 వేల మందికి పైగా అర్హులకు గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ రానివారు ఎక్కడికి పోవాలో తెలియటం లేదని, అధికారులు దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ పలువురు ప్రజాపాలన దరఖాస్తులు పట్టుకొని తిరుగుతున్నట్లు తెలిపారు.

News September 15, 2025

ఏడాదిలో 19 మందిపై పోక్సో కేసులో శిక్ష: నల్గొండ ఎస్పీ

image

గడిచిన సంవత్సరంలో నల్గొండ జిల్లాలో పోక్సో చట్టం కింద 18 కేసులలో 19 మంది నిందితులకు శిక్ష పడిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కేసులలో సకాలంలో సాక్ష్యాధారాలు సేకరించి, ఛార్జిషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News September 15, 2025

కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో 23 అర్జీలు

image

కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో 23 అర్జీలు వచ్చినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం తెలిపింది. ఫిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా విన్నారు. కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, ఫిర్యాదుల రూపంలో వచ్చినట్లు ఆయన తెలిపారు. కేసుల పరిష్కారంలో చిత్తశుద్ధి కనపరచాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు.