News December 29, 2024
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గుంటూరు, గయ(బీహార్) మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07719 గుంటూరు- గయ రైలును జనవరి 25న, నం.07720 గయ- గుంటూరు రైలును జనవరి 27న నడుపుతున్నామని తెలిపింది. నం.07719 రైలు 25న మధ్యాహ్నం 3.30కి విజయవాడ చేరుకుంటుందని, నం.07720 రైలు గయలో 27న బయలుదేరి 29న ఉదయం 1.30కి విజయవాడ వస్తుందన్నారు.
Similar News
News January 1, 2025
ప్రజలు సంతోషంగా జీవించాలి: కృష్ణా ఎస్పీ
కృష్ణా జిల్లా ప్రజలందరికీ ఎస్పీ ఆర్.గంగాధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేళ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అందరికీ ఆనందాన్ని పంచే కొత్త సంవత్సర ఆగమన వేళ ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్నారు.
News January 1, 2025
2024లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!
కృష్ణా జిల్లాలో 2024 లో 9,719 కేసులు నమోదయ్యాయని SP ఆర్.గంగాధర్ అన్నారు. మంగళవారం ఆయన మచిలీపట్నంలో 2024 సంవత్సర నేరగణాంకాల నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2023లో 9,813 కేసులు నమోదవ్వగా 2024లో ఆ సంఖ్య తగ్గిందన్నారు. పోలీసు శాఖ చేపట్టిన ముందస్తు చర్యలు, కమ్యూనిటి పోలీసింగ్ కారణంగా నేరాల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.
News January 1, 2025
ALERT: రత్నాచల్ టైమింగ్స్ మారాయి..!
విజయవాడ-విశాఖపట్నం(నం. 12718) మధ్య ప్రయాణించే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రేపు జనవరి 1 నుంచి ఈ రైలు ఉదయం 6 గంటలకు విజయవాడలో బయలుదేరుతుందని చెప్పారు. గతంలో 6.15కి ఈ రైలు విజయవాడలో కదిలేదన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించే ప్రక్రియలో భాగంగా రైళ్ల షెడ్యూల్ మార్చామని.. ప్రయాణికులు గమనించాలని కోరారు.