News February 19, 2025

విజయవాడ మీదుగా శ్రీకాకుళం రోడ్‌కు స్పెషల్ రైళ్లు 

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా శ్రీకాకుళం రోడ్(CHE), చర్లపల్లి(CHZ) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. ఈ మేరకు నం.07025 CHZ-CHE రైలును ఫిబ్రవరి 21న, నం.07026 CHE-CHZ రైలును ఫిబ్రవరి 22న నడుపుతున్నామంది. ఈ రైళ్లు ఏపీలోని విజయవాడతో పాటు విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందని తాజాగా ఓ ప్రకటనలో SCR పేర్కొంది. 

Similar News

News February 21, 2025

NRPT: 1000 మంది పోలీసులతో పటిష్ట భద్రత: ఎస్పీ

image

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేటలోని ఓ ఫంక్షన్ హాలులో బందోబస్తుకు వచ్చిన పోలీసులకు భద్రతాపరమైన సలహాలు, సూచనలు చేశారు. పర్యటన ముగిసే వరకు అప్పగించిన విధులు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. బందోబస్తును పది సెక్టార్లుగా విభజించి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News February 21, 2025

FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకం

image

అమెరికా నిఘా సంస్థ FBIకి డైరెక్టర్‌గా కాష్ పటేల్ అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు దేశ సెనేట్ ఆయనకు అనుకూలంగా ఓటేసింది. ఆయన ఈ పదవి స్వీకరిస్తున్న తొలి భారత సంతతి వ్యక్తి కావడం విశేషం. గుజరాత్‌కు చెందిన ఆయన తల్లిదండ్రులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. చరిత్ర, క్రిమినల్ జస్టిస్ విభాగాల్లో కాష్ డిగ్రీ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆయన అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు.

News February 21, 2025

విద్యార్థిని సూసైడ్.. నేపాల్-భారత్ బంధంపై ప్రభావం?

image

ఒడిశాలోని కళింగ కళాశాలలో 20 ఏళ్ల నేపాల్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన భారత్-నేపాల్ ద్వైపాక్షిక బంధాలపైనా ప్రభావం చూపిస్తోంది. సరాసరి నేపాల్ ప్రధానే ఈ అంశంలో విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఘటనపై నేపాల్‌లో పార్లమెంటులో రాజకీయ రచ్చ నడుస్తోంది. ఓవైపు ఆ దేశం చైనాకు దగ్గరవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చిలికి చిలికి గాలివానగా మారుతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

error: Content is protected !!