News January 30, 2025

విజయవాడ మెట్రోకు భూసేకరణ.. ప్రభుత్వం ఆదేశం

image

విజయవాడ మెట్రోకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విజయవాడలో మెట్రోకు భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విజయవాడలో మెట్రోకు 101 ఎకరాలు అవసరం కాగా పనులకు ఎంత ఖర్చు అవుతుందో అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదికను కేంద్రంకు పంపారు. ఈ మేరకు భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Similar News

News September 18, 2025

HYDలో ఉచిత బస్‌పాస్ ఇవ్వండి సీఎం సార్!

image

విద్యా వ్యవస్థను మార్చేద్దాం అని అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం ఈ రోజు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే ముందుగా విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థినులకు ఎలాగూ మహాలక్ష్మి సౌకర్యం ఉంది. ఎటొచ్చీ బాయ్స్‌కే ఈ సమస్య. రూ.కోట్లు ‘మహాలక్ష్మి’కి కేటాయిస్తున్న ప్రభుత్వం.. HYDలో కిక్కరిసి ప్రయాణించే స్టూడెంట్‌కు బస్‌పాస్ ఫ్రీగా ఇవ్వాలని కోరుతున్నారు.

News September 18, 2025

KNR: చేతిరాత చాలా ముఖ్యమైంది: కలెక్టర్

image

కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం రాత్రి జిల్లా స్థాయి చేతిరాత విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి హాజరై మాట్లాడారు. హ్యాండ్ రైటింగ్ జీవితంలో చాలా ముఖ్యమైందని, దీనిని ఇంప్రూవ్ చేసుకోవాలని సూచించారు. చేతిరాత అంటే మైండ్ రైటింగ్ అని, మేధస్సుకు పదును పెట్టి మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

News September 18, 2025

జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ నాయకురాలు?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల్లో తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కొత్త పేరు బయటకు వచ్చింది. ఆ పార్టీ HYD నేత మాధవీలత పోటీచేసేందుకు ఆసక్తిచూపుతున్నారని సమాచారం. తాను పోటీచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, ఆ అదృష్టం దక్కాలని కోరుకుంటున్నానని బోరబండలో పేర్కొన్నారు. మాధవీలత గతంలో HYD ఎంపీ స్థానానికి పోటీచేసి పరాజయం పాలయ్యారు.