News April 5, 2025
విజయవాడ: రద్దైన Dy.CM పవన్ భద్రాచలం పర్యటన

డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి భద్రాచలం పర్యటన రద్దయినట్లు విజయవాడలోని ఆయన కార్యాలయ వర్గాలు శనివారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ప్రభుత్వం తరఫున భద్రాద్రి రామయ్యకు శ్రీరామ నవమి సందర్భంగా పవన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తొలుత సమాచారం వెలువడింది. తాజాగా పర్యటన రద్దైనట్లు పవన్ కార్యాలయం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ అధికారులకు సమాచారం అందచేసింది.
Similar News
News April 6, 2025
ముస్లింలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ కవిత

TG: వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే బీజేపీ సర్కారు బిల్లును ఆమోదింపజేసుకుంది. ముస్లింలకు తీవ్ర నష్టం చేకూర్చే ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. మైనారిటీల తరఫున మా పార్టీ పోరాడుతుంది. గతంలోనూ వారి అభివృద్ధి, సంక్షేమానికి మేం కృషి చేశాం’ అని గుర్తుచేశారు.
News April 6, 2025
సిద్దిపేట: యువ రైతు ఆత్మహత్య

మద్యానికి బానిసై యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువ రైతు మ్యాకల స్వామి(38) వ్యవసాయం చేస్తూ తన కుటుంబం జీవిస్తున్నాడు. స్వామికి గత 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చిన అతను బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
News April 6, 2025
విచారణకు మళ్లీ గైర్హాజరైన కమ్రా

కమెడియన్ కునాల్ కమ్రా మూడోసారీ పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు. మహారాష్ట్ర Dy.CM శిండేపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు సమన్లు ఇచ్చిన పోలీసులు నిన్న విచారణకు రావాలంటూ నోటీసులు పంపగా వాటికి ఆయన స్పందించలేదు. తమిళనాడులోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లగా అక్కడ లేకపోవడంతో వాట్సాప్‌లో సందేశం పంపించామని, కమ్రా నుంచి స్పందన లేదని పోలీసు వర్గాలు తెలిపాయి.