News March 21, 2024
విజయవాడ: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చే న్యూస్

రామ్ చరణ్, కాజల్, అమలాపాల్ నటించిన ‘నాయక్'(2013) సినిమా ఈ నెల 23, 24వ తేదీల్లో రీరిలీజ్ అవ్వనుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ G3 థియేటర్‌లో విడుదల కానుంది.’నాయక్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటంతో మెగా ఫ్యామిలీ అభిమానులు సోషల్ మీడియాలో ఈ సినిమాలోని పాటలు, సీన్స్ పోస్ట్ చేస్తున్నారు.
Similar News
News February 15, 2026
నాటి ‘కడలిపల్లే’ నేటి పెదకళ్లేపల్లి క్షేత్రం!

మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో కృష్ణా నది తీరాన ఉన్న శ్రీ నాగేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాచుర్యమైన ఆలయాల్లో ఒకటి. దక్షిణకాశీగా పిలువబడే ఈ ఆలయం బౌద్ధుల కాలం నాటిదిగా చెబుతారు. బౌద్ధుల కాలంలో ఈ ప్రాంతాన్ని కడలిపల్లి అని పిలిచేవారు. ఈ ఆలయానికి ఉత్తరం వైపు కృష్ణానది ప్రవహించడం ఇక్కడి విశిష్టత. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.
News February 13, 2026
కృష్ణా: పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు.!

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన రెండో శనివారం సెలవును జిల్లా విద్యాశాఖ అధికారులు అనూహ్యంగా రద్దు చేశారు. DEO సుబ్బారావు సర్క్యులర్ జారీ చేస్తూ, రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా పరిధిలోని MEO, DYEOలు తమ తమ మండలాల ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందజేశారు.
News February 13, 2026
కృష్ణాజిల్లా MLAల ప్రోగ్రెస్ ఇదే

కృష్ణాజిల్లా MLAలతో CM చంద్రబాబు గురువారం సమావేశం అయ్యారు. MLAల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. పనితీరులో పామర్రు ప్రథమ స్థానం, పెనమలూరు రెండో స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గాల్లో జనసేన, BJP నేతలతో సమన్వయం పెంచాలన్నారు. అవనిగడ్డలో TDP, జనసేన మరింత కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు చేరువగా పనిచేయాలని సూచించారు.


