News September 13, 2025
విజయవాడ: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా విశాఖ(VSKP)-తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08583 VSKP-TPTY రైలు ఈ నెల 15 నుంచి NOV 24 వరకు ప్రతి సోమవారం, నం.08584 TPTY-VSKP రైలు ఈ నెల 16 నుంచి NOV 25 వరకు ప్రతి మంగళవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడతో పాటు కైకలూరు, గుడివాడలో ఆగుతాయని చెప్పారు.
Similar News
News September 13, 2025
GWL: నడిగడ్డ మావోయిస్ట్ పోతుల సుజాత లొంగుబాటు

గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన <
News September 13, 2025
భోగాపురం దాదాపు పూర్తయినట్లే: కేంద్ర మంత్రి రామ్మోహన్

AP: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్షాలు కురుస్తున్నా GMR సంస్థ పనులు ఆపడం లేదన్నారు. విజయనగరంలో విమానాశ్రయ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ‘వచ్చే ఏప్రిల్‌లోగా వైజాగ్ నుంచి రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తాం. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నాం. బీచ్ కారిడార్ కోసం ఇప్పటికే DPR సిద్ధం చేశాం’ అని వివరించారు.
News September 13, 2025
శ్రీ సత్యసాయి జిల్లా SPగా సతీశ్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లాకు నూతన SPగా సతీశ్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఇక్కడ పనిచేసిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నను అనంతపురం పీటీసీకి బదిలీ చేశారు. ఈమె స్థానంలో సతీశ్ కుమార్‌ను నియమించారు. త్వరలోనే నూతన SP బాధ్యతలు స్వీకరించనున్నారు.