News February 3, 2025

విజయవాడ: రైల్వేలో ఉద్యోగం.. ఈరోజే లాస్ట్

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్‌ హెడ్ క్వార్టర్స్‌‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌‌‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025

Similar News

News September 17, 2025

గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ

image

TG: గ్రూప్-1 మెయిన్స్‌ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

News September 17, 2025

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: డిప్యూటీ సీఎం

image

ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుంటోందని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.

News September 17, 2025

వరంగల్: స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం..!

image

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజల కలకలం సృష్టించింది. నిన్న రాత్రి పసుపు కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. ఉదయం స్కూల్ తెరిచి సరికి చూసి ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
క్షుద్రపూజల ఆనవాళ్లతో గ్రామస్థులు, పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.