News October 23, 2025
విజయవాడ రైల్వే డివిజన్‌కు డబ్బే.. డబ్బు!

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో SEP 21వ తేదీ నుంచి OCT 21 వరకు దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగల నేపథ్యంలో మొత్తం 263 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు. సుమారు నెల రోజులకు గాను రూ.563 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. గతంతో పోల్చుకుంటే ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. VJA, రాజమండ్రి, నెల్లూరు, గూడూరు వంటి ప్రధాన స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు.
Similar News
News October 23, 2025
బాపట్ల జిల్లాలో పాఠశాలలకు సెలవు

అకాల వర్షాల నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అధికంగా కురుస్తున్న వర్షాలు వలన విద్యార్థులు ఇబ్బంది పడకూడదని కలెక్టర్ ఆదేశాలతో సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. కావున పాఠశాలల యజమానులు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
News October 23, 2025
NZB: వైన్స్ దరఖాస్తులకు నేడే లాస్ట్

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుందని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులకు 2,658 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. కాగా ఈ నెల 27న భారతి గార్డెన్‌లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
News October 23, 2025
NLG: ఇక ఆ స్కూళ్లల్లో బాలికలకు కరాటే శిక్షణ!

బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ యోజన స్కూళ్లలో ఈ ఏడాది NOV నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు KGBV, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కరాటే శిక్షణ అమలవుతుండగా తాజాగా జిల్లాలో 36 పీఎంశ్రీ పాఠశాలల్లోనూ అమలు చేయనున్నారు. బాలికలకు కరాటే జూడో, కుంగ్ ఫూ నేర్పిస్తారు.